|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 11:05 PM
మ్యాడ్ స్క్వేర్ హీరో నార్నే నితిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నెల్లూరు జిల్లాకు చెందిన శివానీకి మూడు ముళ్లు వేసి జీవిత బంధం కట్టుకున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ హాజరై కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు.వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ గతేడాది శివానీతో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టి జీవితాన్ని కొత్త దశలోకి తీసుకెళ్లింది.ఈ వేడుకకు ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్, భార్గవ్‌లతో హాజరయ్యారు. వేదికను సందడి, హాస్యం, ఆనందం నింపింది.ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు అయిన నార్నే నితిన్ గతేడాది నవంబర్ 3న శివానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఇరువురు కుటుంబ పెద్దల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది.శివానీ కుటుంబానికి నెల్లూరు జిల్లాలో రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కజిన్ డాటర్ కావడం విశేషం.మరోవైపు, ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో ‘మ్యాడ్’ సినిమాతో తెరంగేట్రం చేసిన నితిన్, ఎన్టీఆర్‌కు బావమరిదిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అనంతరం ‘మ్యాడ్ స్క్వేర్’, ‘ఆయ్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.వాస్తవానికి నార్నే నితిన్ నటించిన తొలి చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’, ఆ సినిమా ద్వారానే ఆయన టాలీవుడ్‌లో మొదటి అడుగు వేశారు.
Latest News