|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 10:37 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ఆ తర్వాత వసూళ్లలో కొంత మందకూడుదల కనిపించినా, కలెక్షన్లు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి.ఇప్పటి వరకు విశేషంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ చేరింది. మరికొన్ని ఏరియాల్లో చాలా తక్కువ మొత్తం వచ్చిందంటే, అక్కడ కూడా త్వరలో బ్రేక్ ఈవెన్ పూర్తవ్వనుంది.గమనించదగ్గ విషయం ఏమిటంటే, ‘హరిహర వీరమల్లు’ విడుదల తర్వాత పవన్ కళ్యాణ్‌పై వచ్చిన ట్రోలింగ్ ఆయన కెరీర్‌లోనే అత్యధికంగా ఉండొచ్చునని భావిస్తున్నారు. ఆ సినిమాపై వచ్చిన నెగటివ్ ప్రచారం తర్వాత అతి తక్కువ గ్యాప్‌లో ‘ఓజీ’ విడుదలైంది.అయితే ప్రేక్షకులు ఊహించని రీతిలో పవన్ ఈసారి గంభీరంగా స్పందించారు. ‘ఓజీ’ క్లియర్‌గా మాస్‌ను టార్గెట్ చేస్తూ గట్టి హిట్‌గా నిలిచింది. కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో నిలబడుతూ, అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దిశగా చక్కగా సాగుతున్నాయి.ఒక్క సినిమా ద్వారానే పవన్‌పై వచ్చిన విమర్శలకు సరైన సమాధానం ఇచ్చినట్టైంది. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విజయంపై పవన్ కళ్యాణ్ చాలా సంతృప్తిగా ఉన్నారని సమాచారం. అందుకే, సుజిత్‌కు ప్రీక్వెల్, లేదా సీక్వెల్ చేయాలంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలిసింది.
Latest News