|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 11:43 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 2026 సంవత్సరానికి గాను 198 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ పోస్టులు, 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. అర్హత ప్రమాణాలు, విద్యా అర్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి వివరాలను టీఎస్ఆర్టీసీ సూపర్‌వైజర్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ అందిస్తుంది. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపిక రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు వేతనం, ఇతర అలవెన్సులు ఉంటాయి. పూర్తి వివరాలకు www.tgprb.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.