|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 08:12 PM
బీసీ సంఘాలు రేపు తలపెట్టిన బీసీ బంద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.ఈ నేపథ్యంలో డీజీపీ పలు సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ పేర్కొన్నారు.