|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 10:57 AM
అద్దెకు వచ్చిన వారి బాత్రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా పెట్టించిన యజమాని. ఇంటి యజమాని మరియు ఎలక్ట్రీషియన్‌పై కేసు నమోదు. వెంగల్‌రావ్‌నగర్‌లో బాత్రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చి, వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసిన ఇంటి యజమాని. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు. జవహర్ నగర్‌లోని అశోక్ యాదవ్‌కు చెందిన ఇంట్లో తన భర్తతో నివసిస్తున్న ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేసే వివాహిత (23) . ఈ నెల 4న, బాత్రూమ్‌లోని విద్యుత్ బల్బ్ పనిచేయడం లేదని ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు చెప్పిన వివాహిత. అతను ఎలక్ట్రీషియన్ ద్వారా బల్బ్ రిపేర్ చేయించగా.. ఈ నెల 13న, బాత్రూమ్‌లోని బల్బ్ హోల్డర్ నుండి స్క్రూ పడిపోయిందని గమనించి దానిని పరిశీలించిన ఆమె భర్త . అయితే లోపల లైట్ వేసి చూసినప్పుడు, హోల్డర్ లోపల కెమెరా ఉందని అతను గుర్తించి కంగుతిని.. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు చెప్పిన భర్త . దీంతో ఎలక్ట్రీషియన్ ఈ పని చేసుంటాడని అతన్ని అడగమని యజమానిని కోరిన జంట . కానీ దానికి నిరాకరించి.. కేసు పెడితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు హాని చేస్తాడని బెదిరించిన యజమాని. దీంతో ఎలక్ట్రీషియన్ మరియు ఇంటి యజమానిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన జంట. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం గాలిస్తున్న పోలీసులు