|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 03:19 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీహార్‌కు చెందిన పలువురు నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్, రేవంత్ రెడ్డిని మూర్ఖుడు, తెలివితక్కువవాడు అంటూ బీహార్ ప్రజలను కూలీలు అనడంపై నిలదీశారు. మరోవైపు, జన-సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరతానని శపథం చేశారు. బీహార్ ప్రజల డీఎన్‌ఏ నాసిరకమని రేవంత్ రెడ్డి అవహేళన చేశారని, అందుకే ఆయనను రాహుల్ గాంధీ కూడా కాపాడలేరని కిషోర్ అన్నారు. గతంలో కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను కూడా ప్రశాంత్ కిషోర్ గుర్తుచేసుకున్నారు.