|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 03:16 PM
మెదక్ జిల్లా ఏడుపాయలలో దుర్గాదేవి నిమజ్జనం చేస్తుండగా, మంజీరా వరదలో కొట్టుకుపోయిన కూకట్పల్లికి చెందిన వినయ్, సాయి అనే ఇద్దరు యువకులను పాపన్నపేట పోలీసులు చాకచక్యంగా కాపాడారు. హైదరాబాద్ నుంచి నిమజ్జనం కోసం వచ్చిన 30 మంది భక్తులలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట వినయ్ వరదలో కొట్టుకుపోతుండగా, అతన్ని కాపాడేందుకు దిగిన సాయి కూడా ప్రమాదంలో పడ్డాడు. పోలీసులు వెంటనే స్పందించి వారిద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.