|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 03:12 PM
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మాట్లాడుతూ, గోవిందరావుపేట మండలంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. సీతక్క మంత్రి అయ్యాక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలన, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తే అభ్యర్థులు సులభంగా గెలుస్తారని తెలిపారు. పార్టీ బాగుంటేనే నాయకుల భవిష్యత్తు బాగుంటుందని, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో గౌరవం ఉంటుందని అశోక్ అన్నారు.