|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 03:02 PM
నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్ట్ వద్ద చేపల వేటకు వెళ్లిన రాజంపేట మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన మచ్చంటి శేఖర్ (32) తన కుమారుడు అనిల్ (7)తో కలిసి పెద్ద వాగులో ప్రమాదవశాత్తూ పడి గురువారం సాయంత్రం గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై భార్గవ్ గౌడ్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో గాలింపునకు అంతరాయం ఏర్పడింది. సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.