|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 02:38 PM
నల్గొండ జిల్లాలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో పలువురు ఆశావహులు ఉత్సాహంగా ప్రచారంలోకి దిగారు. పట్టణాలు, నగరాల్లో ఉన్నవారు సొంతూళ్లకు వచ్చి ప్రజలను కలుస్తూ, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు, ఆదరించాలని కోరుతున్నారు. గ్రామాల్లోని పెద్దలను, కుల, యువజన సంఘాలను కలిసి మద్దతు కోరుతున్నారు. కొందరు అభ్యర్థులు ముగ్గురు, ఐదుగురు చొప్పున జాబితాలను తయారు చేసుకుని, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా బలమైన అభ్యర్థులను బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.