|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 09:19 PM
బంగారం ధర మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మంగళవారం దేశీయ మార్కెట్‌లో పసిడి ధర సరికొత్త రికార్డును సృష్టించి, జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరింది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు తగ్గకపోగా, మరింత పైకి ఎగబాకుతుండటం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ రోజు ట్రేడింగ్‌లో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.520 పెరిగింది. ఈ పెరుగుదలతో పసిడి ధర రూ.1,12,750 అనే ఆల్ టైం గరిష్ఠానికి తాకింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ బలంగా ఉండటమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో ధరలు నిరంతరం పెరుగుతున్నాయి.