|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 07:11 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వేడి కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేవలం టికెట్ ఆశించడమే కాకుండా, తాను గెలిస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన పార్టీ అధిష్ఠానానికి షరతు విధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్‌లో తాను పోటీ చేయాలని స్థానిక ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. "నా ఓటు కూడా ఇక్కడే ఉంది. నేను స్థానికుడిని. గతంలో సికింద్రాబాద్ ఎంపీగా రెండుసార్లు గెలిచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను" అని ఆయన గుర్తుచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను అండగా నిలిచానని, ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.