|
|
by Suryaa Desk | Thu, Jul 31, 2025, 09:06 PM
2023-24తో పోల్చితే ముగ్గురు పెరుగుదల – ఆడ పులుల సంఖ్యలో స్పష్టమైన వృద్ధి
అచ్చంపేట: నల్లమల అడవుల్లో పులుల జనాభా స్థిరంగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో (ఏటీఆర్) తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం మొత్తం 36 పులులు (13 మగ, 20 ఆడ) ఉన్నాయి. అదనంగా 2 పులి పిల్లలు కూడా గుర్తించబడ్డారు, ఇంకా ఒకటి లింగ నిర్ధారణలో ఉంది.
*మానిటరింగ్ ప్రక్రియ
2024 డిసెంబర్ 20 నుండి 2025 మే 15 వరకు జరిగిన పులుల పర్యవేక్షణ సర్వేలో, పది రేంజ్‌లను నాలుగు బ్లాక్‌లుగా విభజించి, మొత్తం 1,594 కెమెరా ట్రాప్‌లు అమర్చారు. వీటిని 797 లొకేషన్లలో, ప్రతి 2 కిలోమీటర్లకి ఒక కెమెరా చొప్పున అమర్చారు. పులుల పాదముద్రలు, విసర్జన, స్క్రాచ్ మార్కులు వంటి ప్రత్యక్ష ఆధారాల ఆధారంగా డేటాను విశ్లేషించారు. ఆడ పులుల ప్రాబల్యం – భవిష్యత్ వృద్ధికి సంకేతం ప్రస్తుతం గుర్తించబడిన 20 ఆడ పులులు, పులుల సంతానోత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని సూచిస్తున్నాయి. అటవీ శాఖ చేపడుతున్న పరిరక్షణ చర్యల వలన వచ్చే రెండేళ్లలో పులుల జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వాటి వేట కోసం అవసరమైన జింకలు, దుప్పులు వంటి ప్రేయ్ జంతువుల పెంపకం పునరుద్ధరణ కొనసాగుతోంది.ఏటీఆర్ విశేషాలుఏటీఆర్ మొత్తం 2,611.39 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్నదీ, ఇందులో 2,166.37 అడవిగా, మిగతా 445.02 చద.కి.మీ బఫర్ జోన్‌గా ఉంది. ఇది దేశంలో రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల వరకు విస్తరించి, పులులు, చిరుతలు, వృక్షజీవులు కలసిన జీవవైవిధ్యం నిండిన ప్రాంతం.
*పులుల గుర్తింపు విధానం పులులను చారల నమూనా ఆధారంగా గుర్తిస్తారు – ఇది మనిషి వేలిముద్రల లాగానే ప్రత్యేకం.
ఫొటోగ్రాఫిక్ డేటాబేస్ తో సరిపోల్చి ప్రత్యేక ఐడీ నంబర్లు కేటాయిస్తారు.మగ-ఆడ పులులను శరీర నిర్మాణం, శృంగారపు ప్రవర్తన వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారు
*జనావాసాల తరలింపు :పులుల స్వేచ్ఛగా సంచారం కోసం కోర్ ఏరియాలోని కొన్ని గ్రామాలను తరలించేందుకు చర్యలు మొదలయ్యాయి. మొదటి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట గ్రామాలను బాకారం సమీపానికి మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో దశలో మరికొన్ని గ్రామాలను కూడా తరలించే ప్రణాళిక ఉంది.
*వేటా, పర్యాటనపై నియంత్రణజూలై – సెప్టెంబర్ మధ్య పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో, ఈ సమయంలో అటవీ ప్రవేశాన్ని నిషేధించడం జరుగుతుంది. పర్యాటకులకు అనుమతులుండదు. అంతేకాదు, ఏటీఆర్ పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించి 10 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులకు ప్రత్యేక అనుమతి తప్పనిసరిగా మారనుంది.
*అధికారుల వ్యాఖ్య “పులుల పెరుగుదల మా శాఖ రూపొందించిన వ్యూహాల ఫలితం. భద్రత, ఆహార అందుబాటుతో పాటు స్థానిక చెంచుల సహకారంతో పులులకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.”గోపిడి రోహిత్ రెడ్డి, డీఎఫ్‌ఓ