|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 04:25 PM
TG: ప్రేమ పేరుతో నమ్మించి బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన ఎం.భాస్కర్ 2022లో ఓ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకొని అత్యాచారం చేశాడు. దీంతో అతని మీద కేసు నమోదైంది. ఈ కేసులో స్పెషల్ పీపీ డి.రామిసింగ్ వాదనలు వినిపించగా నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్షతోపాటు రూ.6 వేల జరిమానా విధించారు.