|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 04:19 PM
సంగారెడ్డి(D) పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగ్రాతులను BRS MLC కవిత పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిగాచీ పరిశ్రమ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. పరిశ్రమల్లో రక్షణపై తక్షణమే ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.