![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 06:41 PM
తెలంగాణలో రుతుపవనాల్లో కదలిక వస్తోంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం, తెలంగాణ ఉప్పతల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో అలర్ట్ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈమెకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల నుంచి తెలంగాణలో చాలా చోట్ల కూడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సంబరపడుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన వర్షాలు పడలేదు. అడపదడప వర్షాలు పడగా ఇప్పుడిప్పుడే రుతుపవనాల్లో కదలిక వస్తోంది. రెండు రోజుల నుంచి కూడా ఓ మోస్తార్ వర్షాలు పడడంపై పత్తి రైతులు ఆనందంలో మునిగారు. మే చివరి వారంలో జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు నాటి రైతులు ఆ తర్వాత వర్షాలు లేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత వర్షాలకు మొలకెత్తిన విత్తనాలకు ఊపిరి వచ్చాయి. బంగాళ ఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడింది. ఈ ప్రభావంతో అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాది కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలకు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్టు జారీ చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వర్షాలు కూడడం వల్ల భూమి సాగును సిద్ధం చేసినటువంటి రైతులు ప్రస్తుత వర్షాలకు సంతోషంగా ఉన్నారు. వాతావరణ శాఖ గణాంకల ప్రకారం ఇప్పటివరకు 51 శాతం లోటు వర్షపాతం నమోదై ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు భారీ వర్షపాతం నమోదు కాలేదు. ఎగువన కురిసిన మహారాష్ట్ర వర్షాల ద్వారానే గోదావరి నదిలో ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలో భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఉరకలు వేస్తోంది. జూరాల ప్రాజెక్టు నిండుకుని గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. మరిన్ని వర్షాలు కురిస్తే శ్రీశైలం, సాగర్ నిండనున్నాయి. దీనికి ఇంకా నెలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.