|
|
by Suryaa Desk | Sat, Jun 14, 2025, 11:29 AM
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరీక్షల కోసం మరోసారి AIG ఆస్పత్రికి చేరుకున్నారు. నిన్న కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా, ఇవాళ మరికొన్ని పరీక్షల కోసం తిరిగి వచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటు కేటీఆర్, హరీష్‌రావు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ ఆరోగ్య పరీక్షలు కొనసాగుతున్నాయి.అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని బాత్ రూంలో కాలు జారీ పడటంతో యశోద ఆస్పత్రికి కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక, గత కొంతకాలంగా జలుబుతో ఇబ్బంది పడుతున్న ఆయన శుక్రవారం నాడు సాయంత్రం ఏఐజీ ఆస్పత్రిలో చెకప్ కోసం వెళ్లారు. మిగతా టెస్టుల కోసమని ఈరోజు మరోసారి వెళ్లారు.