|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 03:02 PM
అల్లరి నరేశ్ హీరోగా నటించిన వినోదాత్మక చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. గతేడాది విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా నేటినుంచి ఈటీవీ విన్‌లోనూఅందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంతోమల్లి అంకం దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించగా.. జెమీ లివర్, వెన్నెల కిషోర్, రితూ చౌదరి, అరియానా తదితరులు కీలకపాత్రలు పోషించారు. గణ అలియాస్ గణపతి (అల్లరి నరేష్) ప్రభుత్వ ఉద్యోగి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పని చేస్తుంటాడు. తన చేతులమీదుగా వందల వివాహాలు జరిపించిన అతడికి మూడు పదుల వయసు దాటినా పెళ్లి కాదు. తనకంటే ముందు.. తమ్ముడి(రవికృష్ణ)కి మేనమామ కూతురు (జెమీ లివర్)ను ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఇంట్లో వాళ్లంతా గణ కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు. అతడి వయసు ఎక్కువనో.. తమ్ముడికి ముందు పెళ్లి అయిందనో రకరకాల కారణాలు చెప్పి పిల్లను ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. దీంతో చేసేదేమీ లేక ఆఖరి ప్రయత్నంగా హ్యాపీ మ్యాట్రిమోనీలో ప్లాటినం సభ్యుడిగా చేరతాడు. అక్కడ పరిచయమైన సిద్ధి (ఫరియా అబ్దుల్లా)పై మనసు పారేసుకుంటాడు. అదే మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకొని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే ఖిలాడీ లేడీ అంటూ వార్తల్లోకి ఎక్కుతుంది సిద్ధి. మరి ఆ తర్వాత ఏమైంది? నిజంగా సిద్ధి నేపథ్యమేంటి? ఆమె పని చేస్తున్న మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లి కాని కుర్రాళ్లను ఎలా మోసం చేస్తోంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Latest News