|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 03:29 PM
నటి పాయల్ రాజ్‌పుత్, తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా, ఆమె కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రతి వస్తువు రెండుగా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా, ఇచ్చిన మాట ప్రకారం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరవుతున్నానని ఆమె చెప్పారు. కంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక కళ్లద్దాలతో కవర్ చేసుకున్నానని ఆమె తెలిపారు. దీంతో పాయల్ ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆర్ఎక్స్ 100 సినిమా విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు ఆ తర్వాత ఆశించిన విజయాలు దక్కలేదు. అయినప్పటికీ, హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల 'మంగళవారం' అనే సినిమాతో ఆమె మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పాయల్ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటించగా, వాటిలో రెండు మాత్రమే విజయం సాధించాయి. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించినా, అక్కడ ఆమెకు అంతగా కలిసి రాలేదు.
Latest News