|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 02:12 PM
2016లో విడుదలైన 'దంగల్' చిత్రం, విడుదలైన 9 ఏళ్ల తర్వాత కూడా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా, హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఆయన తన కూతుళ్లను అంతర్జాతీయ రెజ్లర్లుగా తీర్చిదిద్దడానికి పడిన ఆరాటం, సమాజంపై చేసిన పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, ఈ సినిమాను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. లేటెస్ట్ బిగ్ బడ్జెట్ సినిమాలను సైతం పక్కకు నెట్టి టాప్ లిస్టులో నిలవడం విశేషం.
Latest News