|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 02:58 PM
జీవితంలో డబ్బు, కీర్తి, విజయానికి మించినది మరొకటి ఉందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. తాజాగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనిషికి మనశ్శాంతి చాలా ముఖ్యమని, తాను నిరంతరం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. డబ్బు ముఖ్యమైనదే అయినప్పటికీ మనశ్శాంతి దానికంటే గొప్పదని, ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోమంటే మనశ్శాంతినే ఎంచుకుంటానని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
Latest News