|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 03:13 PM
'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 5వ తేదీన పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ను ఎంపిక చేశారని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ సరసన నటిస్తున్న మాళవిక, గతంలో 'తంగలాన్'లో విక్రమ్, మలయాళంలో మోహన్‌లాల్ వంటి సీనియర్ స్టార్లతో కలిసి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మెగాస్టార్‌తో జతకట్టే అవకాశం దక్కించుకుంది.ఈ చిత్రాన్ని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, 'మిరాయ్' చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Latest News