|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 05:45 PM
మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన సినిమాలకు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మలయాళ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకురావడానికి ఆయా సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన 'మిరాజ్' ఇప్పుడు ఓటీటీ తెరపైకి రావడానికి రంగం సిద్ధమవుతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, ఓటీటీ హక్కులను 'సోనీ టీవీ'వారు దక్కించుకున్నారు. 'మిరాజ్' అంటే 'ఎండమావి' అని అర్థం. అంటే దూరంగా నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది .. కానీ దగ్గరికి వెళితే అక్కడ ఏమీ ఉండవు. మళ్లీ కాస్త ముందున నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనినే ఎండమావి అని అంటారు. ఈ కథ కూడా ఇలాగే సాగుతూ ఉంటుంది. అసిఫ్ అలీ .. అపర్ణ బాలమురళి .. హకీమ్ షాజహాన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 19వ థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 23వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.
Latest News