BREAKING
సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు

విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం

సూర్య - మానకొండూర్ : రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్‌కు జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న కసిరెడ్డి రాణిరెడ్డి ప్యానెల్ సభ్యులు శనివారం మానకొండూర్ మండలంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని ముంజంపల్లి, రంగపేట, పచ్చునూర్, ఊటూర్, వేగురుపల్లి, జగ్గయ్యపల్లి గ్రామాల్లో పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా అధ్యక్ష అభ్యర్థి కసిరెడ్డి రాణిరెడ్డి మాట్లాడుతూ.. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, సంస్థను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయడమే తమ ప్యానెల్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలవడంతో పాటు, సంఘం సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తమ ప్యానెల్ సభ్యులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో కార్యదర్శి అభ్యర్థి నరహరి లక్ష్మారెడ్డి, కోశాధికారి అభ్యర్థి ఎడమ జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యక్ష అభ్యర్థులు కూర మహిపాల్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ అభ్యర్థులు సంగీత రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మర్రి రాజిరెడ్డి, ఈసీ మెంబర్ అభ్యర్థి లంబు రాజేందర్ రెడ్డి పాల్గొని ఓట్లు అభ్యర్థించారు.వీరితో పాటు ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, కరీంనగర్ జిల్లా రెడ్డి జేఏసీ అధ్యక్షుడు ఏనుగు చుక్కారెడ్డి, వివిధ గ్రామాల రెడ్డి సంఘాల అధ్యక్షులు, నాయకులు గాజర్ల మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మహిపాల్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, పాకాల రాంరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని ప్యానెల్‌కు మద్దతు తెలిపారు...