BREAKING
సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండన ఆర్.వెంకంపేట సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక అక్రమాలలు దౌర్జన్యాలతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు కనీవినీ ఎరుగని రీతిలో అలుగునూరులో ‘దీక్షా దివస్’ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకొండ లో రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక

సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం

Select Suryaa Now
సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం
  • నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన
  • గ్రామ సమగ్రాభివృద్ధే లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి కూర్మినాయుడు హామీ

గరుగుబిల్లి, సూర్య:  గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలోని నాగూరు గ్రామ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.గ్రామం లోని స్థానిక నాయకులు,కార్యకర్తలు మరియు మద్దతుదారులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయు డు శనివారం గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన ప్రచార కార్యక్రమంలో భాగంగా కేతిరెడ్డి కూర్మినాయుడు గ్రామంలోని ప్రతి వీధిలో, ప్రతి గడపకూ వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించా రు. ప్రచారంలో భాగంగా గ్రామస్తుల నుండి ఆయనకు విశేష స్పందన లభించింది.ఈసందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు మాట్లాడుతూ నాగూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మరియు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈప్రచార కార్యక్రమంలోఎంపీటీసీ సభ్యులు కేతిరెడ్డి శిరీష,మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుత రావు గ్రామ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.