అక్రమాలలు దౌర్జన్యాలతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు
- అభ్యర్థులన భయభ్రాంతులకు గురిచేసి, ఓట్లు గల్లంతు అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది
- మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
- మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళాలు పోయాయి అని చెప్పడం అపహాస్యం.
- ఈ స్థానిక సంస్థలకూటమి పక్షపాత ఎన్నికలకు నిదర్శనం
- మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
పార్వతీపురం, సూర్య: నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తన క్యాంపు కార్యాలయంలో పురపాలక సంఘానికి చెందిన 36 వార్డుల వైసిపి అభ్యర్థులు, చైర్ పర్సన్ అభ్యర్థితో కలిసి పత్రిక సమావేశం శనివారం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల పార్వతీపురం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడలేని విధంగా ఎప్పుడు జరగనీ విధంగా అనేక అక్రమాలు, దౌర్జన్యాలు, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, ఓట్ల లెక్కింపులో అన్యాయాలకు ఒడికట్టడం వంటి అనే అంశాలను మీ ముందు ఉంచేందుకు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, నా గత 25 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చూసిన సుమారు 6 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు చూడని ఎక్కడ జరగని విధంగా పార్వతీపురం నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం హయాంలో జరిగిన అరాచక పరిపాలనా రాజకీయ విధానంతో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను జరగనీయకుండా దౌర్జన్యాలు, అభ్యర్థులను భయభ్రాంతులను చేయడం, ఎన్నికల లెక్కింపులో అక్రమాలకు తెర తీయడం, ఓట్లను తారు మారు చేయడం, గెలిచిన వైసిపి అభ్యర్థులను కాదని అధికారులను అడ్డుపెట్టుకొని లేని గెలుపును చూపించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అపహాస్యం చేస్తూ వారికి అనుకూలంగా మలుచుకోవడం నిజంగా శోచనీయం అన్నారు.అయితే పార్వతీపురం నియోజకవర్గంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో గాని ప్రజలు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు తెలియజేసి గత సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ కంటే 10 శాతం ఓట్లు అధికంగానే వచ్చినప్పటికీ అవి తీర్పు రూపంలో బయటకు రానీయకుండా ఈ కూటమి ప్రభుత్వం అక్రమాలకు ఒడిగట్టి విష సంస్కృతికి తెరలేపిందని, కూటమి ప్రభుత్వం అసమర్ధ పాలనను కప్పిపుచ్చేందుకు ఓటర్ల తీర్పును కాలరాస్తూ చెప్పలేనన్ని అక్రమాలకు, అన్యాయాలకు ఒడికట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు ముందుకెళ్తున్న వైనాన్ని నేడు మీ ముందు ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఇటీవల పూరపాలక సంఘం ఎన్నికల్లో నమోదైన కొన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వెనకాల ఆర్వో సంతకం కానీ, స్టాంపులు కానీ లేకుండా చాలా ఓట్లు ఉన్నాయని వాటిపై తమ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరమని ఈ మా ఆరోపణలపై జిల్లా ఎన్నికల అధికారి తప్పకుండా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు, నాడు అర్బన్ ప్రాంతంలో తనకు ఓటు లేదని తనని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు నాడు రావద్దని పోలీసు అధికారులు తనకి తెలియజేసారని, అలానే నేను కూడా 5వ తేదీన జరగనున్న ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడిన ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిది కూటమి ఎమ్మెల్యే ఏ విధంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లారని, ఎందుకు అధికారులు, పోలీసులు అడ్డుకోలేదని, నాడు ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే కౌంటింగ్ కేంద్రం వద్ద అనేక అక్రమాలకు తెరలేచాయని అనుమానాలు మాకు కలుగుతున్నాయని, అలానే నాడు స్ట్రాంగ్ రూమ్ తాళాలు పోవడం, అందుకు ముగ్గురు అధికారులను బాధ్యులు చేసి డిస్మిస్ చేయడం, మళ్లీ ఆ ముగ్గురు అధికారులు కూడా ఎన్నికల కౌంటింగ్ చివరి వరకు అక్కడే ఉండడం, కొన్ని బ్యాలెట్ బాక్సులు సీలు లేకుండా, తమ ఏజెంట్లు సంతకాలు లేకుండా తీసుకురావడం వంటి అనేక అంశాలపై న్యాయం కోరుతూ అనుమానం ఉన్న చోట్ల రీకౌంటింగ్ తో పాటు అభ్యంతర ఓట్ల పరిశీలన కోరుతూ జిల్లా న్యాయస్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించడం జరిగిందని అందుకు 90 రోజులు గడువును న్యాయస్థానం విధించిందని, ఈ స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎదుర్కొంటున్న అనేక ఆరోపణలకు జిల్లా ఎన్నికల అధికారి తప్పకుండా స్పందించి అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని, తమకి న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని తప్పక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తూ జిల్లా ఎన్నికల అధికారినీ డిమాండ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.అలానే బలిజిపేట మండలం జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ అప్పుడు కూడా 34 వేల ఓట్లకు 35,000 ఓట్లు ఎక్కువ చేసి చూపించడం, ఐదు రౌండ్లు లెక్కింపులో అక్రమాలకు తావివ్వడం, కూటమి నాయకుల ఒత్తిడిలకు ఎన్నికల అధికారులు తలోగ్గి వారికి అనుకూలంగా ఫలితాలను తారుమారు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని తీవ్రస్థాయిలో ఆయన ఎన్నికల అధికారుల, పోలీసుల తీరుపై మండిపడుతూ తప్పకుండా జిల్లా ఎన్నికల అధికారి స్పందించి చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇదే కాకుండా ఇప్పుడు గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా అధికార పక్ష నాయకులు అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ, నిర్బంధ నామినేషన్ల ఉపసంహరణకు వత్తిడి తెస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూన్నారు అని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓట్ల అడిగి గెలుచుకోవడం ఒక పద్ధతి గాని ఇలా అక్రమాలకు అన్యాయాలకు ఒడిగెట్టి గెలుపును తమ ఖాతాలు వేసుకోవడానికి కూటమి నాయకులు ఉవ్విళ్లూరదం నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులంటిది అన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచి వారు తరపున పోరాటం చేయడం జరుగుతుందని ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజల్లోకి వెళ్లి ప్రజలు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలవడం జరుగుతుందని తప్పకుండా ఈ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చేసాయని మునుముందు ఈ కూటమి అరాచకాల సాగవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గొర్లి మాధవరావు, చైర్ పర్సన్ అభ్యర్థి పట్నాన సాయిశ్రీ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ సభ్యులు పోల సత్యనారాయణ, కౌన్సిలర్ సభ్యులు, కౌన్సిలర్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.