తొలిరోజు 48 సర్పంచ్, 164 వార్డు నామినేషన్లు
వెల్దుర్తి, మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వెల్దుర్తి మండలంలో శనివారం ప్రారంభమైంది. తొలిరోజు మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ పదవులకు 48, వార్డు సభ్యుల స్థానాలకు 164 నామినేషన్లు దాఖలయ్యాయి.సర్పంచ్ స్థానాలు: బోయనపల్లి, రామళ్లకోట పంచాయతీల్లో అత్యధికంగా 6 చొప్పున నామినేషన్లు వేశారు. నర్లాపురం, నర్సాపురం, సూదేపల్లి, వెల్దుర్తి, శ్రీరంగాపురంలలో 4 చొప్పున; మల్లెపల్లిలో 3; బుక్కాపురం, కలుగొట్ల, కృష్ణాపురం, లక్ష్మీనగరం, సర్పరాజాపురంలలో 2 చొప్పున; భోగోలు, పుల్లగుమ్మి, బొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున దాఖలయ్యాయి. చెరుకులపాడు, గోవర్ధనగిరి, మాదార్‌పురం, పెరెముల, రత్నపల్లి, అలుగుండు, బింగిదొడ్డి పంచాయతీల్లో ఖాతా తెరవలేదు.వార్డు సభ్యుల స్థానాలు: వెల్దుర్తిలో అత్యధికంగా 29 నామినేషన్లు దాఖలు కాగా.. బోయనపల్లిలో 24, లక్ష్మీనగరంలో 17, నర్సాపురంలో 16, రామళ్లకోటలో 15, కలుగొట్లలో 10 చొప్పున పడ్డాయి. భోగోలు, నర్లాపురం, సర్పరాజాపురంలలో 8 చొప్పున; సూదేపల్లి, శ్రీరంగాపురం, మల్లెపల్లిలలో 7 చొప్పున; బొమ్మిరెడ్డిపల్లిలో 4, బింగిదొడ్డిలో 2, పుల్లగుమ్మిలో 1 నామినేషన్ దాఖలయ్యాయి. బుక్కాపురం, చెరుకులపాడు, గోవర్ధనగిరి, మాదార్‌పురం, పెరెముల, కృష్ణాపురం, రత్నపల్లి, అలుగుండు పంచాయతీల్లో తొలిరోజు నామినేషన్లు పడలేదు.