పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి
-ఎన్నికల ప్రచారంలో టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల
ఆమదాలవలస, నవంబర్ 21, మేజర్ న్యూస్
ఆమదాలవలస పట్టణ అభివృద్ధికి కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల తెలిపారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో 14వ వార్డులో కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి కూన రామలక్ష్మితో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించేందుకు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని, చైర్ పర్సన్ గా గెలిపించేందుకు తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆమదాలవలస పట్టణంలో మెట్టెక్కివలస ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మెట్టెక్కి వలస ప్రాంతానికి ప్రధాన సమస్యగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 89 కోట్ల రూపాయలతో ఇంటింటికి తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచినట్లు తెలియజేశారు. మరింత అభివృద్ధి చేసేందుకు తమ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు, సైకిల్ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షరాలు కనితి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.