BREAKING
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం... పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం...

Select Suryaa Now
విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం...

 

నరసన్నపేట నవంబర్ 21 మేజర్ న్యూస్ : తామరాపల్లిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ కళాశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. కళాశాల పరిసరాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సేకరించి పరిసరాలను శుభ్రపరిచారు.

సేకరించిన చెత్తను స్వచ్ఛ రథం సిబ్బందికి అప్పగించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా తగిన విధంగా పారవేయడం, పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం వంటి అంశాలను వివరించారు.

పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని, పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు సైతం భాగస్వాములు కావాలని నిర్వాహకులు సూచించారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పరిశుభ్రత పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ వి కృష్ణ తార , అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.