రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు..
(అనంతపురం, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)
అనంతపురం నగరంలోని రహమత్ నగర్‌లో అరుదైన బ్రహ్మ కమలాలు వికసించి స్థానికులను ఆకట్టుకున్నాయి. ఏఆర్ కానిస్టేబుల్ రామచంద్ర సతీమణి ప్రమీల నివాసంలో బ్రహ్మ కమలాలు పుష్పించడంతో ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వికసించిన బ్రహ్మ కమలాలకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఇంట్లో బ్రహ్మ కమలాలు వికసించాయన్న విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ అరుదైన పుష్పాలను ఆసక్తిగా తిలకించారు. కొందరు భక్తులు పూజల్లో పాల్గొని పుష్పాలను దర్శించుకున్నారు.
రాత్రి సమయంలో వికసించే ప్రత్యేకమైన బ్రహ్మ కమలాలు తమ ఇంట్లో పూయడంతో ప్రమీల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పుష్పాల వికాసంతో రహమత్ నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.