నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా
కోసమాల, జాడుపల్లిలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ
మెలియాపుట్టి. నవంబర్ 21. మేజర్ న్యూస్.....
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నేపథ్యంలో మెలియాపుట్టి మండలంలోని కోసమాల, జాడుపల్లి గ్రామాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఆయా గ్రామాల్లోని జడ్పీ హైస్కూళ్లలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా పాతపట్నం సీఐ కె. వెంకటరావు, ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నామినేషన్ల పరిశీలన సమయంలో అభ్యర్థులు, వారి అనుచరుల రాకపోకలపై పోలీసులు నిఘా ఉంచారు. కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ భద్రతా చర్యలను సమీక్షించారు. పోలీసుల పర్యవేక్షణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.