BREAKING
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం... పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

వినబడని ప్రజల దాహం కేకలు..!

Select Suryaa Now
వినబడని ప్రజల దాహం కేకలు..!

 

నరసన్నపేట నవంబర్ 21 మేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో గత నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందిరానగర్, హట్కో కాలనీ, వంశధార కాలనీ, గాంధీనగర్ నాలుగో వీధి, తసారు వీధి, పురుషోత్తం నగర్ కాలనీ, శివనగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.

కనీస అవసరమైన తాగునీటిని కూడా సకాలంలో అందించడంలో మేజర్ పంచాయతీ అధికారులు, వాటర్ సప్లై విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తరచూ తాగునీటి సమస్యలు తలెత్తుతున్నప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు.

నీటి సరఫరా నిలిచిపోయినప్పుడు కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం లేదని, సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై స్పష్టత ఉండటం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు నాలుగు రోజులైనా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు నిత్యావసరమైన తాగునీటి సరఫరాలో ఇంతటి నిర్లక్ష్యం గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా మేజర్ పంచాయతీ అధికారులు స్పందించి వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

కాగా, తాగునీటి సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలు, పునరుద్ధరణ చర్యలపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారం అందుబాటులోకి రాలేదు.