BREAKING
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం... పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట

Select Suryaa Now
మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట

​కోటబొమ్మాళి, నవంబరు 21, మేజర్ న్యూస్: మత్స్యకారుల సంక్షేమం, వారి జీవనోపాధికి భద్రత కల్పించడంతో పాటు ఆక్వా రైతుల అభ్యున్నతి, మత్స్య రంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకార సోదరులకు, ఆక్వా రైతులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమంపై నిర్లక్ష్యం వహించి వేట నిషేధ భృతిగా కేవలం రూ.10,000 మాత్రమే అందించారని, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.20,000 అందిస్తోందని వివరించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు, 2026-27 సంవత్సరానికి గాను శ్రీకాకుళం జిల్లాలోని 16,737 మంది సాగర మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున మొత్తం రూ.32.38 కోట్ల భృతిని డీబీటీ విధానంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని మంత్రి తెలిపారు. ​మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో రూ.444.75 కోట్ల అంచనా వ్యయంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. ఈ హార్బర్ అందుబాటులోకి వస్తే 180 ట్రాలర్లు, 600 బోట్లు కలిపి మొత్తం 780 బోట్ల వరకు నిలుపుకునే సౌకర్యం కలుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలతో పాటు చేపల వేట, నిల్వ, రవాణా, మార్కెటింగ్ రంగాలకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రొయ్యలు, చేపల సాగు చేసే ఆక్వా రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ.1.50కే అందిస్తూ సాగును లాభసాటిగా మారుస్తున్నామని పేర్కొన్నారు. అలాగే మత్స్యకారులు, ఆక్వా రైతులకు బ్యాంకుల ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డుల కింద 7 శాతం వడ్డీతో, అర్హులైన వారికి ఎలాంటి హామీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.