BREAKING
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం... పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం

Select Suryaa Now
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం


సర్పంచ్ గా నడిపల్లి గంగా భవాని  ..!
పంచాయతీ పోరులో వెనకబడిన వైసిపి
అనకాపల్లి ప్రతినిధి, నవంబర్ 21, మేజర్ న్యూస్; 
కసింకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ గా నడిపల్లి గంగ భవాని, మరో ఆరు వార్డులు ఏకగ్రీవo అయ్యాయి. నడిపల్లి గంగ భవాని ఇంత వరకు బిజెపి ఎంపీటీసీగా పనిచేశారు. ఇప్పుడు కూడా కూటమి బలపరిచిన బిజెపి అభ్యర్థిగా గంగ భవాని సర్పంచిగా పోటీలో నిలిచారు. గంగ భవాని భర్త గతంలో పంచాయతీ వైస్ సర్పంచిగా కూడా పనిచేశారు.అయితే వైసీపీ తరఫునుంచి కూడా ఎల్లపు అన్నపూర్ణ, పెంటకోట కుమారి, మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వైసిపి అభ్యర్థులు నామినేషన్లు అయితే వేశారు గాని సర్పంచ్ బరిలో పోటీ చేయడానికి చేతులెత్తేసి, వైసిపి అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో గంగ భవాని ఏకగ్రీవం అయింది. అలాగే ఆరవ వార్డు నుంచి కోటిని గణేషు, 8వ వార్డు నుంచి జెర్రీ పోతుల వరలక్ష్మి, 11వ వార్డు నుంచి నక్క నాగమణి,12వ వార్డు నుంచి నడిపల్లి దివ్యలక్ష్మి, 15వ వార్డు నుంచి వేగి సాయి,16వ వార్డు నుంచి బత్తిన సూర్య నాగలక్ష్మి ఏకగ్రీవాలు అయ్యాయి. కసింకోట మేజర్ పంచాయతీలో 18 వార్డులకు గాను ఆరు వార్డులు ఏకగ్రీవం కావడంతో మరో 12 వార్డులకు ఎన్నిక కానుంది. 
కసింకోట చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏకగ్రీవం జరగడం ఇదే మొదటిసారి. గత ఎన్నికలలో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నంతగా పోటీపడేవారు. కసింకోట మేజర్ పంచాయితీలో ప్రధానంగా కుల సామాజిక వారిగా కాపు, గవర, యాదవ, ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నాయి. వీటిలో పంచాయతీ ఎన్నికలలో చివరకు వచ్చేసరికి కాపు, గవర సామాజిక వర్గాల మధ్య నువ్వా, నేనా అన్నట్టు సర్పంచ్ పదవికి పోటీ రసవత్రంగా జరిగేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఏకగ్రీవం కావడంతో కసంకోట ప్రజలు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలనే కసింకోట ఏకగ్రీవానికి కారణం అని పలువురు అంటున్నారు.