BREAKING
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం... పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్..

Select Suryaa Now
సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్..

 

నరసన్నపేట నవంబర్ 21 మేజర్ న్యూస్: నరసన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఇందిరా నగర్‌లోని తమ నివాసం నుంచి అనుచరులతో కలిసి ర్యాలీగా బయలుదేరి మేజర్ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. నిర్ణయించిన ముహూర్త సమయంలో ఎన్నికల అధికారి నారాయణదాసుకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరసన్నపేట పట్టణంలోని ప్రధాన సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. పట్టణ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలందరూ తమకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, వాటి పరిష్కారానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ తమ సమస్యలపై ఫిర్యాదుల పుస్తకం ద్వారా తెలియజేయవచ్చునని కూడా వివరించారు. పట్టణ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉందని, అవినీతికి తావులేని పాలనతో పాటు అభివృద్ధినే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. పలువురు వార్డు సభ్యులు కూడా నామినేషన్ పత్రాలను అందించారు.

**  ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..

ఇందిరానగర్ నుంచి నరసన్నపేట ప్రధాన రహదారి మీదుగా ర్యాలీగా బయలుదేరిన అభ్యర్థి పొట్నూరు వాణి సాయి ప్రసాద్, అనుచరులను సీఐ ఎం. శ్రీనివాసరావు అడ్డుకున్నారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి లేదని, మార్గం మార్చుకుని సంతపేట మీదుగా వెళ్లాలని సూచించారు. దీంతో మాజీ సర్పంచ్ బూరళ్లి శంకర్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ర్యాలీలకు అనుమతిస్తూ తమ ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు.
దీనిపై సీఐ స్పందిస్తూ ఎన్నికల నియమావళి ప్రకారం ర్యాలీల నిర్వహణకు నిబంధనలు వర్తిస్తాయని, ముందస్తు అనుమతి తీసుకుంటే నిబంధనలకు అనుగుణంగా కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అనంతరం పొట్నూరు వాణి సాయిప్రసాద్ ర్యాలీ మార్గాన్ని మార్చుకుని సంతపేట మీదుగా పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు.