BREAKING
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం... పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

మాచవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం..

Select Suryaa Now
మాచవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం..

సూర్య రీజినల్ & పొలిటికల్ డెస్క్ (మాచవరం):పంచాయతీల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాచవరం గ్రామ రాజకీయాలు మరింత వేడెక్కాయి.కూటమి బలపర్చిన గ్రామ సర్పంచి అభ్యర్థిగా బరిలో నిలిచిన మైపాల తాతాజీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తన మద్దతుదారులు, అనుచరులతో కలిసి గ్రామంలోని మెట్ల కాలనీ, షాదిఖానా ప్రాంతం, డైలీ మార్కెట్, గౌడ స్ట్రీట్‌లలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల ఆశీర్వాదం తీసుకున్నారు.
ప్రచారంలో భాగంగా డైలీ మార్కెట్‌లోని చిరు వ్యాపారులు, మెట్ల కాలనీ,గౌడ స్ట్రీట్ నివాసితులతో మైపాల తాతాజీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను సర్పంచిగా ఎన్నికైతే ఆయా కాలనీలలో అంతర్గత సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని,డైలీ మార్కెట్ పరిసరాలలో పారిశుద్ధ్య మెరుగుదల, వ్యాపారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసానిచ్చారు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయా వీధుల ప్రజలు, మహిళలు,పెద్దలు,యువకులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాబోయే పోలింగ్ తేదీ నాడు తన ఎన్నికల గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను అభ్యర్థించారు.