BREAKING
కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా తొలిరోజు 48 సర్పంచ్, 164 వార్డు నామినేషన్లు సైకిల్ గుర్తుకే మీ ఓటు ప్రశాంతంగా ముగిసిన అరసవల్లి, శ్రీకూర్మం తెప్పోత్సవాలు మాచవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం.. సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండన ఆర్.వెంకంపేట సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక అక్రమాలలు దౌర్జన్యాలతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు కనీవినీ ఎరుగని రీతిలో అలుగునూరులో ‘దీక్షా దివస్’ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకొండ లో రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం

సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక

Select Suryaa Now
సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక

 

సిరివెళ్ల పట్టణంలో వైసిపికి భారీ షాక్ 
*టీడీపీ లోకి సునామీగా తరలివచ్చిన ముస్లిం మైనార్టీ సోదరులు.
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; నియోజకవర్గంలోని మండల కేంద్రమైన సిరివెళ్లలో శనివారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో వైసీపీని వీడి పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ నాయకులు టిడిపిలో చేరారు.  నాసిర్ ఖాన్, మాలి ఖాన్, రైస్ మిల్ కాజా, డి హమీద్, ఫైజల్ ఖాన్, కలాం ఖాన్, అజ్మత్ ఖాన్, ఇజాజ్ ఖాన్, ఆసిఫ్ ఖాన్, మహమ్మద్ ఇలియాస్ ఖాన్, ఉల్లిగడ్డల భాష అన్నదమ్ముల కుటుంబాలు, ఇలా 400 వందల నుండి 500 కుటుంబాలను ప్రభావితం చేసే వారందరూ ఈరోజు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ
పది రోజులుగా సిరివెళ్ల మండలంలో  ఎన్నోసార్లు ఇక్కడికి రావడం జరిగిందని ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకరు వైసీపీని వీడి టిడిపిలోకి రావడం జరుగుతుందని, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని అందుకోసమే సునామీ లాగా   తరలి వస్తున్నారని తెలిపారు, ఇప్పటికే సిరివెళ్ల పట్టణానికి కోటి 50 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగిందని రాబోయే రోజుల్లో,జడ్పీటీసీ నిధులు ఎంపీపీ నిధులు, సర్పంచ్ నిధులు అన్ని ఊరి అభివృద్ధి కోసమే ఉపయోగించడం జరుగుతుందని ఆమె అన్నారు.సిరివెళ్ల లొ భూమా సొంత గూటికి వస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు .ఈ మార్పుకు కారణమైన మహమ్మద్ హుస్సేన్, ఫిదా కి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు.మీరు ఏ నమ్మకంతో అయితే పార్టీలోకి వచ్చారో కచ్చితంగా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్క పనిని చేసి చూపిస్తానని ప్రజలందరికీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బో యిలకుంట్ల శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా