BREAKING
కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా తొలిరోజు 48 సర్పంచ్, 164 వార్డు నామినేషన్లు సైకిల్ గుర్తుకే మీ ఓటు ప్రశాంతంగా ముగిసిన అరసవల్లి, శ్రీకూర్మం తెప్పోత్సవాలు మాచవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం.. సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండన ఆర్.వెంకంపేట సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక అక్రమాలలు దౌర్జన్యాలతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు కనీవినీ ఎరుగని రీతిలో అలుగునూరులో ‘దీక్షా దివస్’ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకొండ లో రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం

మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

Select Suryaa Now
మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
  • పిబి శ్రీనివాసరావు మా దగ్గర మాజీ మేనేజరు మాత్రమే
  • (సాలూరు జమిందారు విక్రమ్ చంద్ర సన్యాసి రాజు)

సాలూరు సూర్య:  పిబి శ్రీనివాసరావు అనే వ్యక్తి గతంలో మా దగ్గర మేనేజరుగా పని చేసినంత మాత్రాన మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని సాలూరు జమిందారు విక్రమ చంద్ర సన్యాసి రాజు పత్రికా ముఖంగా హెచ్చరించారు.మంగ్లవారం జమిందారు కోటలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు అనారోగ్యం కారణంగా మా దగ్గర మేనేజరుగా పని చేస్తున్న పిబి శ్రీనివాసరావుకు మా ఆస్తుల విషయమై పవర్ ఆఫ్ అటార్నీ అప్పజెప్పామన్నారు. మేము ఇచ్చిన అధికారాన్ని పిబి శ్రీనివాసరావు దుర్వినియోగం చేస్తూ ప్రజలతో పాటు, అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న విషయం తన దృష్టికి రావడంతో 2020 లోనే అతనికి ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని రద్దుచేసామన్నారు.

 సాలూరులో వున్న మా ఆస్తులతో మా జమిందారి వారసులకు మాత్రమే క్రయ విక్రయాలకు పూర్తి హక్కులు ఉంటాయే తప్పా అన్యులకు హక్కులు వుండవని ఈ సందర్భంగా సాలూరు ప్రజలకు తెలియజేసారు. ఒకవేళ మా ఆస్తుల విషయంలో జమిందారి ఫౌండర్ నని పిబి శ్రీనివాసరావు జోక్యం కల్పించుకునేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విలేకరులకు తెలియజేశారు.