సైకిల్ గుర్తుకే మీ ఓటు
-ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, నవంబర్ 21, మేజర్ న్యూస్
మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్పర్సన్ అభ్యర్థిగా కూన ప్రమీల, 2 వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా కూన వెంకటరాజ్యలక్ష్మి పోటీ చేస్తున్నందున సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో 2వ వార్డు కృష్ణాపురంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారం నిర్వహిస్తూ కూటమి చేపట్టిన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి, తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేయాలని తెలియజేశారు. వార్డు మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కౌన్సిలర్ గా వెంకటరాజ్యలక్ష్మిని గెలిపించేందుకు ఓటర్లు సహకరించాలన్నారు. ఇప్పటికే వార్డు అభివృద్ధి పథంలో నడుస్తుందని, రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను ప్రజలకు అందించామన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి అవకాశం కల్పించేలా అత్యధిక మెజార్టీ ను అందించాలని సూచించారు. ఈ ప్రచారంలో టిడిపి నాయకులు కూన భానూజీరావు, తదితరులు పాల్గొన్నారు.