BREAKING
కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా తొలిరోజు 48 సర్పంచ్, 164 వార్డు నామినేషన్లు సైకిల్ గుర్తుకే మీ ఓటు ప్రశాంతంగా ముగిసిన అరసవల్లి, శ్రీకూర్మం తెప్పోత్సవాలు మాచవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం.. సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండన ఆర్.వెంకంపేట సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక అక్రమాలలు దౌర్జన్యాలతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు కనీవినీ ఎరుగని రీతిలో అలుగునూరులో ‘దీక్షా దివస్’ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకొండ లో రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం

కనీవినీ ఎరుగని రీతిలో అలుగునూరులో ‘దీక్షా దివస్’ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Select Suryaa Now
కనీవినీ ఎరుగని రీతిలో అలుగునూరులో ‘దీక్షా దివస్’ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సూర్య - మానకొండూర్ : నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కాంగ్రెస్ దోబూచులాటకు ముగింపు పలుకుతూ, 'కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో' అన్న నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన పవిత్ర దినమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు.మానకొండూర్ శివారులోని అలుగునూరు వద్ద నిర్వహించనున్న ‘దీక్షా దివస్’ సభా ప్రాంగణాన్ని శనివారం ఆయన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి సందర్శించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావుతో కలిసి సభా ఏర్పాట్లు, పనుల పురోగతిని పరిశీలించారు.అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. 1969 ఉద్యమం నుండి 50 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉద్యమాలను అణచివేసిందని విమర్శించారు. ఆత్మబలిదానాలతోనైనా రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు బయలుదేరగా, అలుగునూరు వద్ద అక్రమంగా అరెస్ట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్ దీక్షకు పూనుకోకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, పదేళ్ల అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని అన్నారు.
భూమి, గాలి ఉన్నంతవరకు దీక్షా దివస్:
దీక్షా దివస్ అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని, ఇది యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని గంగుల స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటు నాటి చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని, భూమిపై గాలి ఉన్నంతవరకు ప్రతి ఏటా దీక్షా దివస్ నిర్వహిస్తామని తెలిపారు. అలుగునూరును ఒక పవిత్ర స్థలంగా భావిస్తూ, కవులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాల సమక్షంలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ వేడుకను నిర్వహిస్తున్నామని చెప్పారు.
వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి:ఈ మహాసభకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని కమలాకర్ వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రానున్న నాలుగైదు రోజుల్లో సభా ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజలందరూ స్వచ్ఛందంగా వేలాది సంఖ్యలో తరలివచ్చి అలుగునూరు దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.