BREAKING
పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు బక్కుపేట సర్పంచ్‌గా దీసరి సింహాచలంఏకగ్రీవ ఎన్నిక విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి: సీఐ కిరణ్ ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలి.. ఆర్డీఎంఏకు రాష్ట్ర సంఘ నాయకుల వినతి.. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి:ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ కీసర డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొమ్ము చిరంజీవి నూతనకల్ లో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్తులకు వైద్య సేవలు రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇంటి స్లాబ్‌.. అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం.. కాలువను దాటి రోడ్డు వైపు నిర్మాణం.. అధికారులు స్పందించి తొలగించాలని ఫిర్యాదు..

కీసర డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొమ్ము చిరంజీవి

Select Suryaa Now
కీసర డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొమ్ము చిరంజీవి

కీసర,మేజర్ న్యూస్: కీసర డివిజన్‌లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే దిశగా పార్టీ నాయకత్వం కీలక నియామకం చేపట్టింది. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ ఆదేశాల మేరకు యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతుడు కొమ్ము చిరంజీవిని కీసర డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు డివిజన్ అధ్యక్షుడు కోల బాల్‌రాజ్ యాదవ్ నియామకం చేపట్టారు.ఈ సందర్భంగా కొమ్ము చిరంజీవి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో డివిజన్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన జిల్లా, డివిజన్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తానని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కీసర డివిజన్‌లో బీజేపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.