telangana
భృంగి సీబీఎస్ఈ ఉపాధ్యాయులతో సమావేశమైన మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్
మేజర్ న్యూస్:భృంగి విద్యాసంస్థల చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ భృంగి సీబీఎస్ఈ ఉపాధ్యాయులతో సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. తరగతి గదిలో ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహించాలని అన్నారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను స్థానిక ప్రాంత విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విద్యాసంస్థల కార్యదర్శి ఏ. ప్రమీల మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రేమ, ఆప్యాయతతో బోధన సాగించాలని సూచించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్ తరగతి గదులను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు శారీరక దృఢత్వానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, విశాలమైన పాఠశాల ప్రాంగణంలో క్రీడా కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో డైరెక్టర్లు కుమారస్వామి, శివప్రసాద్, ప్రిన్సిపాళ్లు జనని, మహేందర్ రెడ్డి, నవనీత్, టాప్‌టెక్ సిబ్బంది సయ్యద్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.