ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత
పాలకొండ, సూర్య: పాలకొండ మండల పరిషత్ అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికైన కర్నేన యోగిత నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆమె భర్త కర్నేన అప్పలనాయుడు తో పాటు పలువురు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, ముఖ్య అనుచరులతో శనివారం కార్యాలయానికి చేరుకున్నారు. బాధ్యతలు స్వీకరించేందుకు,కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు ఎంపీడీవో, కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.అనంతరం కార్యాలయంలోని తనఛాంబర్ లో కూర్చొనిసంతకంచేశారు.ఈసందర్భంగా అధికారులు,సిబ్బందితోపాటు, పలువురు నేతలు ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిష్పక్షపాతంగా వ్యవహరించి మండలంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అధికారులు ప్రజలు తన ప్రయత్నాలకు మద్దతునివ్వాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.ఈ కార్యక్రమం లో కర్నెన అప్పలనాయుడు,జాడ శ్రీధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.