సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు
సాలూరు సూర్య: డిసెంబర్ 2 న జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు శనివారం 34 నామినేషన్లు, 74 వార్డు మెంబర్లకు అభ్యర్థుల నుండి నామినేషన్లు వచ్చాయని జిల్లా ఎన్నికల సహయ అధికారి గొల్లపల్లి పార్వతి స్థానిక విలేఖర్లకు తెలియజేశారు. సర్పంచ్ ఎన్నికలకు ఈ నెల 21 నుండి 23 వరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోదలిచిన అభ్యర్థులు 27 తేది చివరి రోజన్నారు. ఎన్నికల నామినేషన్లు 8 కేంద్రాల్లో అబ్యర్దుల నుండి నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. ఈ మూడు రోజులు కురుకూటి, మామిడిపల్లి, తోనాం, కొత్తవలస, తుండ పెదబోరబంద, శివరాంపురం, మామిడి కేంద్రాల్లో అబ్యర్దులు నామినేషన్లు వేసుకునే వెసులుబాటు కల్పించామని తెలియజేశారు. అదేవిధంగా 29 పంచాయతీలకు గాను కోటిగా వివాదాస్పద గ్రామాలలో నిర్వహించి ఎన్నికలను ఆయా ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని పంచాయితీలకు సంబంధించిన ఎన్నికలను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహిస్తామని తెలిపారు.