BREAKING
సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండన ఆర్.వెంకంపేట సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక అక్రమాలలు దౌర్జన్యాలతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు కనీవినీ ఎరుగని రీతిలో అలుగునూరులో ‘దీక్షా దివస్’ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకొండ లో రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక

తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

Select Suryaa Now
తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
  • కార్తీక మాసం సందర్భంగా 'చినతిరుపతి'లో ఆధ్యాత్మిక శోభ
  • శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో బారులు తీరిన భక్తులు
  • గోవింద నామస్మరణతో మార్మోగిన నాగావళి తీరం

గరుగుబిల్లి, సూర్య: ఉత్తరాంధ్రలో 'చినతిరుపతి'గా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి మరియు శ్రీకోదండరామస్వామి ఆలయాలు కార్తీక మాసం రెండవ శనివారం సందర్భంగా భక్తులతో కిట కిటలాడాయి.తెల్లవారుజామున నాగావళి నదిలో భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి,కార్తీక దీపాలను వెలిగించారు.అనంతరం స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన,విశేష హోమములు, శాత్తుమురై తదితర పూజా కార్యక్రమా లు నిర్వహించడంతోపాటు అభిషేకా లు,తులసీ దళాలతో అర్చనలు నిర్వహించారు.గోవిందా.. గోవిందా.. నామస్మరణతో ఆలయ ప్రాంగణమం తా మార్మోగింది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు.శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందు కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావ డంతో ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని దేవస్థానం కార్య నిర్వహణ అధికారి వి వి సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది గంట శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.