BREAKING
సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండన ఆర్.వెంకంపేట సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక అక్రమాలలు దౌర్జన్యాలతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు కనీవినీ ఎరుగని రీతిలో అలుగునూరులో ‘దీక్షా దివస్’ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకొండ లో రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక

రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం

Select Suryaa Now
రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం
  • శ్రీసీతారామందిరం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం
  • బంకుపల్లి సూర్యనారాయణశర్మ ఆధ్వర్యంలో భజన కీర్తనలు
  • కార్తీక శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని దీపారాధన కార్యక్రమం

గరుగుబిల్లి, సూర్య: మండల పరిధిలోని రావుపల్లి గ్రామంలోని శ్రీసీతారామమందిరంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భముగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించ డంతో పాటు శుక్రవారం రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు.పవిత్ర కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించు కుని రావుపల్లి గ్రామంలోని శ్రీసీతా రామ మందిరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినమును పురస్కరించుకుని దీపారాధన కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు.శ్రీసీతారామమందిరం ప్రాంగణంలో నిర్వహించిన దీపారాధన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ప్రవత్తులతో దీపాలను వెలిగించారు. అదే విధముగా శ్రీసీతా రామమందిరంలో ప్రముఖ భజన గురువు బంకుపల్లి సూర్యనారాయ ణశర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం లో ప్రత్యేక భజన మరియు సంకీర్తన కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషే కాలు నిర్వహించగా, సాయంత్రం వేళ భజన బృందం ఆలపించిన కీర్తనలు గ్రామస్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టతను వివరిస్తూ, భగవన్నామ స్మరణతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని భజన గురువు బంకుపల్లి సూర్యనారాయణశర్మ ఈసందర్భంగా పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు, భజన మండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.ఈకార్యక్రమంలో భజన బృందం సభ్యులు బొంతాడ మహేశ్వరరావు(మహేష్),చింతాడ తవిటాచారి, చింతాడ రుద్రకోటేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు.