BREAKING
సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు

పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక
  • గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవానికి ముందుకొచ్చిన గ్రామస్తులు
  • ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందనలు

పార్వతీపురం, సూర్య: పార్వతీపురం మండలం  పెదమరికి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా మైసర్ల  నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహక నజరానా ప్రకటించిన నేపథ్యంలో, గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పెదమరికి  గ్రామస్తులు ఏకగ్రీవ ఎన్నికకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి, రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ మైసర్ల  నాగమణిని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.