ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు
పార్వతీపురం, సూర్య: మండలంలోని పలు పంచాయతీ సర్పంచుల ఏకగ్రీవం ఉత్కంఠ నడుమ పూర్తయింది. వెంకంపేట పంచాయతీ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డంతో ఆర్వో ధృవీకరణ పత్రాలను అందజేశారు. దీంతోపాటు సూడిగాం పంచాయతీ గొరజాన కైవసం చేసుకున్నారు. ఉపసంహరణ వేళ చివరి క్షణం వరకు నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో ఉత్కంఠ నెలకొంది. కొన్ని వార్డుల అభ్యర్థులకు బుజ్జగింపులు, కవ్వింపులు జరిగాయి.