BREAKING
సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు

ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస

Select Suryaa Now
ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస
  • శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
  • శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేసిన బొత్స రామకృష్ణ,భూదేవి దంపతులు

గరుగుబిల్లి, సూర్య: గరుగుబిల్లి మండలం మరుపెంట పంచాయతీ పరిధిలోని సాంబన్నవలస గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.గ్రామస్థుల చిరకాల కోరికైన శ్రీఅభయాంజనేయ స్వామి వారి నూతన ఆలయ నిర్మాణ పనులకు అత్యంత వైభవంగా భూమి పూజ నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ నాయకులు బొత్స రామకృష్ణ, సర్పంచ్ అభ్యర్థి బొత్స భూదేవి దంపతులు ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని,వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బొత్స రామకృష్ణ, మరుపెంట గ్రామ పంచా యతీ సర్పంచ్ అభ్యర్థి బొత్స భూదేవి మాట్లాడుతూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని,శ్రీ అభయాంజనేయస్వామి కృపతో గ్రామస్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.గ్రామంలో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు బొత్స రామకృష్ణ, భూదేవి దంపతులు పేర్కొ న్నారు.అదే విధంగా సాంబన్నవలస గ్రామ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.గ్రామంలో ఆలయ నిర్మా ణం జరగడం ఎంతో శుభపరిణామ మని, ఆఅభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండా లని ఆకాంక్షించారు.శ్రీఅభయాంజ నేయస్వామి ఆలయ నిర్మాణ శంకు స్థాపన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.