BREAKING
సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు

ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు

Select Suryaa Now
ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు
  • ఎంపీపీగా నారాయణస్వామి, ఏకగ్రీవ సర్పంచ్ గా సతీమణి వాసవికుమారి
  • ఉల్లిభద్ర గ్రామంలో సంబరాల వెల్లువ!
  • "మరడాన"దంపతులకు అభినందనల వెల్లువ
  • గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామన్న నూతన సర్పంచ్

గరుగుబిల్లి, సూర్య: ఒకే కుటుంబం నుంచి అందు లోనూ భార్య,భర్తలిద్దరూ కీలక ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై రికార్డు సృష్టిం చారు.గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర  గ్రామానికి చెందిన దంపతులు ఒకేసారి ప్రజా సేవలో కీలక బాధ్యతలు చేపట్ట డం పట్ల మండల వ్యాప్తంగా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి.ఉల్లిభద్ర గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి రెండు కీలక ప్రజాప్రతినిధి పదవులు దక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గరుగుబిల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా (ఎంపీపీ) మరడాన నారాయణస్వామి బాధ్యతలు స్వీకరించగా,తాజాగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరడాన నారాయణస్వామి సతీమణి మరడాన వాసవికుమారి ఏకగ్రీవంగా ఉల్లిభద్ర సర్పంచ్‌గా  ఎన్ని కయ్యారు.గ్రామ పెద్దలు, యువత మరియు ప్రజలంతా ఏకతాటిపై నిలిచి వాసవికుమారిని సర్పంచ్‌గా ఏకగ్రీవం గా ఎన్నుకోవడం పట్ల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.అటు మండల స్థాయిలో ఎంపీపీగా భర్త మరడాన నారాయణస్వామి, ఇటు గ్రామ స్థాయిలో భార్య మరడాన వాసవికుమారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈఅరుదైన గౌర వాన్ని అందుకున్న మరడాన దంపతు లకు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్య కర్తలు మరియు ఉల్లిభద్ర గ్రామస్తులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపు తున్నారు.ఈఅరుదైన అవకాశంతో ఉల్లిభద్ర గ్రామంతో పాటు గరుగుబిల్లి మండలం మరింత అభివృద్ధి చెందు తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈసందర్భంగా నూతన సర్పంచ్ వాసవికుమారి మాట్లాడు తూ..తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన తన భర్త మరడాన నారాయణస్వామి సహకా రంతో ఉల్లిభద్ర గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఈసందర్భంగా మరడాన వాసవికుమారి హామీ ఇచ్చారు.